ఫేస్‌బుక్‌ కలిపింది ఇద్దరినీ...

17 Jun, 2017 08:31 IST|Sakshi
ఫేస్‌బుక్‌ కలిపింది ఇద్దరినీ...

- యువతి ఆదర్శ వివాహం
-వరుడు దివ్యాంగుడు


తుమకూరు (కర్ణాటక): ఫేస్‌బుక్‌ వేదికగా ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ఆకాంక్షలు, ఆశయాల విషయాల్లోనూ ఇద్దరిదీ ఒకే బాట. ఈక్రమంలో వారి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారి చివరకు జీవితాంతం కలిసి ఉండేలా పెళ్లితో ఒకింటి వరాయ్యారు. ఈ ఘటన తుమకూరు జిల్లా, హులియురు సమీపంలో చేసుకుంది.  తుమకూరు జిల్లాకు చెందిన నాగరాజుకు రెండు కాళ్లు సచ్చు పడ్డాయి. అయినప్పటికీ కుంగిపోకుండా డిగ్రీ  పూర్తి చేశాడు. అదే సమయంలో కంప్యూటర్‌ శిక్షణ పూర్తి చేశాడు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో  కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేశాడు. తర్వాత  జిల్లా పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేరాడు.

అదే సమయంలో ఫేస్‌బుక్‌ ద్వారా  చిక్కమగళూరు జిల్లాలోని కడూరు ప్రాంతానికి చెందిణ జ్యోతితో పరిచయం ఏర్పడింది.  నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జ్యోతికి తల్లిదండ్రులు లేరు. బంధువుల సహకారంతో తుమకూరులోని ఓ గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. ఫేస్‌బుక్‌ద్వారా కాలక్రమంలో నాగరాజు, జ్యోతి  స్నేహితులుగా మారారు. ఆశయాల విషయంలో ఇద్దరివీ ఒకే రకమైన అభిప్రాయాలు కావడం, పైగా ఇద్దరిదీ ఒకే కులం కావడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు నాగరాజును చూసేందుకు వెళ్లారు. ఆయనకు రెండు కాళ్లు లేవనే విషయం తెలిసింది.  అయితే తమ ప్రేమకు అంగవైకల్యం అడ్డుకాదని జ్యోతి పేర్కొనడంతో  శుక్రవారం  అంబారపుర సమీపంలోని  కలగెరి ఈశ్వరుడి దేవాలయంలో వివాహం చేశారు.   తాలూకా పంచాయతీ స్థాయి సమితి అధ్యక్షుడు ఏజెంట్‌ కుమార్, సమాజ పోరాట వాది  దబ్బగుంటె  రవికుమార్‌లు దంపతులను ఆశీర్వదించారు.
 

>
మరిన్ని వార్తలు