గౌరీలంకేశ్‌ కేసులో మరో సంచలన విషయం

13 Sep, 2017 10:59 IST|Sakshi
గౌరీలంకేశ్‌ కేసులో మరో సంచలన విషయం

► గౌరీ లంకేశ్‌, ఎం.ఎం కాల్బుర్గీ హత్యలకు ఒకే ఆయుధం

సాక్షి, బెంగుళూరు: ప్రముఖ జర్నలిస్ట్‌, సామాజికవేత్త గౌరీలంకేశ్‌ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2015 ఆగస్టులో హత్యకు గురైన ప్రముఖ రచయిత, హేతువాది డాక్టర్ ఎం.ఎం కాల్బుర్గి, గౌరీ లంకేశ్‌ హత్యలు ఒకే ఆయుధంతో చేసినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీ ప్రాధమిక నిర్ధారణలో వెల్లడైంది. 7.65 ఎం.ఎం తో దేశంలో తయారైన తుపాకీతో చంపినట్లు ప్రాథమిక పరిశోధనలు సూచించాయి.

ఈరెండు హత్యల్లో సుమారు 80శాతం పోలికలు సరిపోలాయని, ఈ ఘోరాలను ఒకే తుపాకిని ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లంకేశ్‌ హత్యపై కుటుంబ సభ్యులు సీబీఐ విచారణను డిమాండ్‌ చేయగా, కర్ణాటక ప్రభుత్తం ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బెంగుళూరు, ఇతర మావోయిస్టు ప్రభావిత జిల్లాలో సిట్‌ సుమారు 80మందిపైగా విచారించింది. గౌరీలంకేష్‌ హత్య గావించబడిన రోజు ఆమె ఇంటిముందు మూడు సార్లు అనుమానాస్పదంగా తిరిగిన గుర్తు తెలియని వ్యక్తి గురించి ముమ్మరంగా గాలింపు చేపట్టింది.

మరిన్ని వార్తలు