'సన్ ఫిక్చర్స్' ఫైన్ వేసిన హైకోర్టు

22 Apr, 2016 08:37 IST|Sakshi

చెన్నై: చాలా కాలంగా విచారణలో ఉన్న ఎందిరన్ చిత్ర కథ వివాద కేసులో ఆ చిత్ర నిర్మాణ సంస్థకు అపరాధం విధిస్తూ ఉత్తర్వులు జారీ జారీ చెసింది. వివరాల్లోకెళ్లితే సూపర్‌స్టార్ రజనీకాంత్,ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన చిత్రం ఎందిరన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అయితే ఈ చిత్ర కథ తనదంటూ ఆళూర్ తమిళ్‌నాడన్ అనే రచయిత 2010లో చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

అందులో ఆయన పేర్కొంటూ తను 1996లో జూకిబా అనే కథను రాశానన్నారు.ఈ కథ అదే సంవత్సరంలో ఉదయం అనే పత్రికలో సీరియల్‌గా ప్రసారం అయ్యిందన్నారు.అలాంటి తన కథను దర్శకుడు శంకర్ తన అనుమతి లేకుండా ఎందిరన్ పేరుతో చిత్రంగా రూపొందించారని పేర్కొన్నారు. కాబట్టి తన అనుమతి లేకుండా తన కథను చిత్రంగా తెరకెక్కించిన దర్శకుడు శంకర్, చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నష్టపరిహారంగా తనకు కోటి రూపాయలు చెల్లించాల్సిందిగా ఆదేశించాలని కోరారు.

ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలంగా విచారణలో ఉంది.దీనికి దర్శకుడు శంకర్‌గానీ, సన్ పిక్చర్స్ సంస్థగానీ బదులు పిటిషన్ దాఖలు చేయలేదు.దీంతో కేసును న్యాయస్థానం ఏక పక్షంగా విచారించడానికి సిద్ధమైంది.అందులో భాగంగా పిటిషన్‌దారుడి నుంచి వాగ్మూలం తీసుకుంది.కాగా ఈ కేసు  గురువారం న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ సమక్షంలో విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ తరఫున ఒక పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.

అందులో ఏక పక్షంగా కేసు విచారణను నిలిపేయాలని పేర్కొన్నారు. అదే విధంగా ఆరూర్ తమిళ్‌నాటిన్ బదులు పిటిషన్‌ను దాఖలు చేశారు.సుమారు ఐదేళ్ల సమయం దాటిన తరువాత ఈ పిటిషన్‌ను ఎలా విచారణకు స్వీకరించగలం అని న్యాయమూర్తి ప్రశ్నించారు.దీంతో ఆరూర్ తమిళనాటిన్ తరపున హాజరైన న్యాయవాదులు పీటీ.పెరుమాళ్,ఎల్.శివకుమార్ వాదిస్తూ ఈ కేసు సుదీర్ఘ కాలం విచారణలో ఉందన్నారు. దీన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నామన్నారు.

అదే విధంగా కేసు విచారణ ఆలస్యానికి కారణమైన సన్ పిక్చర్స్ సంస్థకు అపరాధం విధించాలని కోరారు.దీంతో న్యాయమూర్తి సన్ పిక్చర్స్ సంస్థకు 25 వేలు అపరాధం విధిస్తూ ఆ మొత్తాన్ని మానా మధురైలో గల కుష్ఠురోగుల ఆస్పత్రికి అందజేయాలని ఆదేశించారు.అదే విధంగా ఈ కేసు విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు