జాగృతం కాకపోతే కోలారు ఎడారే

30 Jan, 2015 23:43 IST|Sakshi
జాగృతం కాకపోతే కోలారు ఎడారే

మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్
చెరువుల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగంపై పరిమితి లేకపోవడంతోనే అనర్థాలు

 
కోలారు : నీటి వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో కోలారు జిల్లా ఎడారి కాక తప్పదని రాజస్తాన్‌కు చెందిన ప్రముఖ జలవనరుల నిపుణుడు, మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ హెచ్చరించారు. జల నిర్వహణపై కోలారులోని చన్నయ్య రంగమందిరంలో శుక్రవారం నిర్వహించిన ఒక రో జు వర్‌‌కషాప్‌లో ఆయన ప్రసంగించారు. నీటి వినియోగంలో కోలారు జిల్లాలోని రైతులు, ప్ర జలు తగిన జాగ్రత్తలు పాటించడం లేదని, ఇది దుష్పరిమాణాలకు దారితీస్తుందని అన్నారు. తాను ఈ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మూడు అంశాలను ప్రధానంగా గుర్తించినట్లు తెలిపారు. అందులో నీటిని సక్రమంగా విని యోగం చేయకపోవడం, చెరువుల, రాజకాలువల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగం పై పరిమితి లేకపోవడం అని స్పష్టం చేశారు. ఈ మూడు కారణాల వల్ల కోలారు జిల్లాలో తీవ్ర నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించడం, మలినమైన నీటిని  శుద్ధీకరించే వరకూ కోలారు జిల్లాలో భూగర్భ జలాలను రీఛార్‌‌జ చేయడం సాధ్యపడదని వివరించారు. కోలారు జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ర్టంలోనే నీటి వినియోగంపై రైతులు దృష్టి నిలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్, లాభాలపై చూపుతున్న ఆసక్తి నీటిని పొదుపుగా వాడుకోవడంపై అన్నదాతలు కనబరచడం లేదని అన్నారు.

రాజస్తాన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తారని తెలిపారు. దీని వల్ల ఏనాడు నీటి సమస్య తలెత్తలేదని అన్నారు. నీటి మూలాలను అన్వేషించడంతో పాటు సద్వినియోగం చేసుకోవడం, వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచవచ్చునని సూచిం చారు. రాజస్తాన్‌లో సగటు వర్షపాతం 300 మి.మీ ఉండగా, కోలారులో 500 మి.మీ ఉందని తెలిపా రు. అయితే రాజస్తాన్‌లో తీసుకున్న జాగ్రత్తల వల్ల అక్కడి పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలు ఆ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. చెక్‌డ్యాంలు, ఇంకు డు గుంతలు (వాటర్ హార్వస్టింగ్) విధానాన్ని ప్రతి చోటా అమలు చేయాలని అన్నారు. ఉద్యాన పంట లకు బిందు సేద్యం తప్పనిసరిగా చేయాలన్నారు. రాజస్తాన్ తాను పడ్డ కృషి వల్ల దాదాపు ఏడు నదులను రీజనరేట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంత మాత్రం లేదని, కేవలం ప్రజలు చేయడం వల్లనే సాధ్యమైం దని అన్నారు. కోలారులో కూడా ప్రజలు నీటి రక్ష ణ, మిత వాడకంపై దృష్టి సారించాలని అన్నారు. చెరువులు, రాజకాలువలలో ఆక్రమణల తొలగింపు ప్రభుత్వం బాధ్యత కాదని ప్రజలే ముందుండి ఆక్రమణలు తొలగిస్తే చెరువులకు నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కలెక్టర్ త్రిలోక్‌చంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ రత్నమ్మ నంజేగౌడ, సీఈఓ పనాలీ, జెడ్పీ సభ్యులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు