మనం ధరించిన దుస్తులను చూసి విదేశీయులు నచ్చి, మెచ్చి వాటిని గౌరవించడం మనకు తెలుసు. అయితే ఒక విదేశీ వనిత ధరించిన మన దేశీ దుస్తులు టాక్ ఆఫ్ ది వరల్డ్ కావడం.. అవి మనకు అద్భుతంగా అనిపించడం.. ఇప్పుడు ఆ స్టైల్స్‌ని అనుసరించడానికి ఫ్యాషన్ లవర్స్ ఆరాటపడటం.. జరుగుతోంది. అంటే నిజంగా ఆ విదేశీ వనితను అభినందించాల్సిందే. ఆ ఘనత దక్కించుకుంది మరెవరో కాదు మిషెల్ ఒబామా. ఇప్పుడు సిటీ ఫ్యాషన్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది ట్రెండ్స్. .
.:: ఎస్.సత్యబాబు
అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తన భర్తతో సహా మన దేశానికి వచ్చారు. తిరిగి వెళ్లనూ వెళ్లారు. మనదేశంతో అనుబంధాల గురించి మాట్లాడి ఒబామా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నట్టే.. అద్భుతమైన డిజైనర్ దుస్తులతో మిషెల్ కూడా అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సిటీజనులకు ట్రెండ్ సెట్టర్ అయ్యారు.
క్రేజీ కాంబినేషన్...
మిషెల్ ధరించిన దుస్తులు క్రేజీ కాంబినేషన్‌గా అందరి మెప్పునూ పొందుతున్నాయి. పాపీ ప్రింట్ కోట్ కు కేప్ కోట్, సింపుల్ బ్లాక్ పంప్స్ కాంబినేషన్‌తో లుక్‌ని మెరిపించిన మిషెల్.. డ్రెస్సింగ్ ఇప్పుడు సిటీ డిజైనర్స్‌కు హాట్ ట్రెండ్ అయింది. సిటీలో పలువురు ఫ్యాషన్ ప్రియులైన అమ్మాయిలు మిషెల్ డ్రెస్సింగ్ స్టైల్‌ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటంతో.. సిటీ డిజైనర్లు అర్జెంట్‌గా తమ అస్త్రాలకు పదును పెట్టి ఆ తరహాలో వెరైటీ డిజైన్లకు శ్రీకారం చుడుతున్నారు. బ్లూ ఫ్లోరల్ మోటిఫ్స్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ నీ లెంగ్త్ డ్రెస్‌ను ఆమె ప్రత్యేకంగా మన భారత్ సందర్శన కోసం రూపొందించుకున్నారు. దీనిలో ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి రానున్న స్ప్రింగ్ సమ్మర్‌కి సంబంధించిన లేటెస్ట్ కలె క్షన్. దీన్ని ‘షీట్’ డ్రెస్ అని పిలుస్తారు. మిషెల్ ధరించిన దుస్తుల్లో కోట్, డ్రెస్ రెండింటికీ ఒకే ఫ్యాబ్రిక్ వాడారు. ఇది కొత్త ట్రెండ్. ఆమె ధరించిన దుస్తులకు వాడింది పాలియస్టర్ బ్లెండ్‌లో సూతింగ్ ఫ్యాబ్రిక్ అయి ఉంటుందని సిటీ డిజైనర్ నీరజ కోన అంటున్నారు.
భారతీయ డిజైన్ల అభిమాని...
తాజా మిషెల్ పర్యటన కోసం దుస్తుల్ని డిజైన్ చేసింది జన్మతః ఒడిసాలోని రూర్కెలా వాసి, ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్న భారతీయ డిజైనర్ బిభూ మహాపాత్ర. భారతీయ డిజైన్లకు ప్రపంచవ్యాప్త కీర్తి తీసుకొచ్చారు మిషెల్. ఇప్పుడే కాదు అమెరికాలో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆమె జన్మతః ముంబై వాసి అయిన డిజైనర్ నయీమ్ ఖాన్ దుస్తులను ధరించారు.
గత 2010లో భారత సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఆయనే రూపొందించిన మెటాలిక్ కాలమ్‌ను ధరించారు. అదే ఏడాది 33వ యాన్యువల్ కెన్నెడీ సెంటర్ హానర్స్ కార్యక్రమానికి సైతం ఆమె నయీమ్ డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ గౌన్నే ధరించారు. తర్వాతి ఏడాది జర్మన్ చాన్స్‌లర్ అంజెలా మెర్కెల్ కోసం నిర్వహించిన స్టేట్ డిన్నర్లో ఆమె బ్రీడెడ్ కాలమ్ ధరించారు.
బ్రెజిలియన్ ప్రెసిడెంట్ డిల్మా రూసెఫ్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా ఆమె నీ లెంగ్త్ ఎంబ్రాయిడరీ డ్రెస్‌ను ఎంచుకున్నారు. 2012లో భారత్ సందర్శనకు వచ్చినప్పుడు కూడా న యీమ్ ఖాన్, రాచెల్రాయ్ల డిజైన్లను ధరించిన మిషెల్ ఇప్పుడు కూడా తన భారతీయ ఫ్యాషన్ ప్రియత్వాన్ని చాటుకున్నారు. పెద్దన్నలో అర్ధభాగమైన మిషెల్ ఒబామా డ్రెస్సింగ్ స్టైల్స్‌లో మన డిజైన్లు ఒక విడదీయలేని భాగం అయిపోవడం విశేషం.
ట్రెండీ డ్రెస్ అది...
మిషెల్ ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు ధరించిన డ్రెస్ రియల్లీ ట్రెండీ. దీని వల్ల ఇండియన్ డిజైనర్ బాగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. నీ లెంగ్త్ షీట్ డ్రెస్. ఇప్పుడు సిటీలో చాలా మంది అమ్మాయిలు ఈ వెరైటీ కాంబినేషన్‌పై ఆసక్తి చూపుతున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చారనే కాదు గతంలో కూడా అమెరికాలో తను పాల్గొన్న పలు కార్యక్రమాల్లో మిషెల్ ఇండియన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించారు. అయితే ఈసారి డ్రెస్సింగ్ బాగా ఎలివేట్ కావడంతో గతంలో మిషెల్ ధరించిన ఇండియన్ డిజైనర్స్ డ్రెస్‌ల గురించి కూడా సిటీ అమ్మాయిలు నెట్లో సెర్చ్ చేస్తున్నారు.
- నీరజ కోన, టాలీవుడ్ స్టైలిస్ట్
మిసమిషెల్
Published Sat, Jan 31 2015 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement