జయ ‘ఆస్తుల’ కేసులో నేడు తీర్పు

11 May, 2015 02:50 IST|Sakshi

బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు విషయంలో సోమవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించనుంది.  గత సెప్టెంబర్ 27న ఇదే కేసులో జయలలితకు స్పెషల్ కోర్టు నాలుగేళ్లు జైలు, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈమెతో పాటు మరో ముగ్గురికి కూడా శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జయలలిత, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ సాగడంతో పాటు తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజలు, ఏఐఏడీఎంకే నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు