ఇక కర్ణాటక.. పర్యాటక హబ్

9 Sep, 2015 04:24 IST|Sakshi
ఇక కర్ణాటక.. పర్యాటక హబ్

- నూతనంగా 11 థీమ్ పార్క్‌లు
- మొత్తం వ్యయం రూ.708 కోట్లు
- ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటుకు సన్నాహాలు
- ఏడాది పొడవునా పర్యాటకుల ఆకర్షణే లక్ష్యం
- పెలైట్ ప్రతిపాదికన స్నో, డిస్నీల్యాండ్, కేబుల్‌కార్ పార్కుల ఏర్పాటు
సాక్షి, బెంగళూరు:
కర్ణాటకను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 11 థీమ్ పా ర్కులను రాష్ట్రం నలుమూలలా ప్రారంభించనుంది. అవసరమైన నిధుల కోసం ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకోనుంది. టెం పుల్ టూరిజానికి కర్ణాటక పెట్టింది పేరు. దేశ విదేశాల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో ఉన్న దేవాలయాలు, అందులోని శిల్పా లు తిలకించడానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో రాష్ట్రానికి వచ్చే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మిగిలిన నెలల్లో కర్ణాటక ప్రభుత్వానికి పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం తక్కువగానే ఉం టుంది.

దీనినిదృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో వి విధ ప్రాంతాల్లో 12 నెలల పాటూ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా 11 థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా పెలైట్ ప్రతిపాదికన స్నో పార్క్, డిస్నీల్యాండ్ మా దిరి పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ.193 కోట్లుగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్దతిలో పర్యాటక శాఖ సమకూర్చుకోనుంది.

అదేవిధంగా మం చి కొండలు, గుట్టలు కలిగిన కర్ణాటకలో కేబుల్ కార్ టూరిజాన్ని అభివృద్ధి చే యడానికి వీలుగా చాముండిహిల్స్, నందిహిల్స్, కెమ్మనగుడి, మధుగిరిల్లో కేబుల్ కార్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కు కోసం పీపీపీ విధానంలో రూ.80 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మూడింటితో సహా మొత్తం 11 థీమ్ పార్కుల ఏర్పాటుకు రూ.708 కోట్లు ఖర్చుకాగలవని పర్యాటక శాఖ అంచనా వేసింది. పర్యాటక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవనున్నాయని పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు