ముఖ్యమంత్రి, స్పీకర్‌కు చీర, నైటీ!

22 Sep, 2017 13:59 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడిపాడి పళినిస్వామి, స్పీకర్‌ ధనపాల్‌కు చీర, నైటీలను పంపిన ఎనిమిదిమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈరోడ్‌ ఈస్ట్‌ జిల్లా కొంగునాడు వెట్టువగౌండర్‌ యువజన సంక్షేమ సంఘం కార్యదర్శి జగదీశన్‌ ఆధ్వర్యంలో నిర్వాహకులు గురువారం ఈరోడ్‌ తపాలా కార్యాలయానికి చేరుకున్నారు. వీరు సీఎంకు నైటీ, స్పీకర్‌కు చీర పంపేందుకు వినూత్న ఆందోళన జరిపారు.

దీని గురించి వారు మాట్లాడుతూ మెజార్టీ కోల్పోయిన పళనిస్వామి ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరిపేందుకు ఉత్తర్వులివ్వని స్పీకర్‌ ధనపాల్‌, 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని, ఇది ప్రజాస్వామిక హత్యని విమర్శించారు. మైనార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించే ఎడపాటి వైఖరిని నిరసిస్తూ ఆందోళన జరుపుతున్నట్లు తెలిపారు. నిరసనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్‌ చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

కరోనా ఎఫెక్ట్‌: సీఎం వేతనం కట్‌!

బలాదూర్‌గా హోం క్వారంటైనీ

నడుస్తూనే షాపులకు వెళ్లాలి

కళ్లతోనే.. కరోనా వైరస్‌ వ్యాప్తి

సినిమా

హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి: పూజా హెగ్డే

కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి 

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు