లక్ష్మీమీనన్ పాసయిందోచ్

26 May, 2015 03:51 IST|Sakshi
లక్ష్మీమీనన్ పాసయిందోచ్

నటి లక్ష్మీ మీనన్ ప్లస్-2 పాసయ్యారు. పదో తరగతి చదువుతుండగానే సినిమా రంగంలోకి వచ్చేసిన నటి లక్ష్మీమీనన్. మొదట్లో మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసినా ఆమెకు సినీ జీవితాన్ని ప్రసాదించింది మాత్రం తమిళ చిత్రపరిశ్రమనే చెప్పాలి. కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ కేరళా కుట్టికి ఆ తరువాత ఇక్కడ వెనక్కుతిరిగి చూసుకోవలసిన ఆవసరం ఏర్పడలేదు. పాండినాడు, మంజాపై, నాన్‌శివప్పుమణిదన్, కోంబన్ అంటూ వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గాపేరు సంపాదించుకుంది. అలాంటి లక్ష్మీమీనన్ కార్తితో కొంబన్ చిత్రాన్ని పూర్తి చేసి నటనకు చిన్న విరామం ఇచ్చి మధ్యలో ఆపేసిన చదువు పై దృష్టి సారించింది. అలా పట్టుదలతో చదివి ఇటీవల ప్లస్-2 పరిక్షలు రాసింది. ఈ పరిక్షా ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. లక్ష్మీమీనన్ 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తల్లి తెలిపారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు