‘తెలంగాణలో విద్యుత్‌కు డిమాండ్‌’

11 Jan, 2017 12:57 IST|Sakshi
హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతోందని, మన అవసరాలకు అనుగుణంగా వచ్చే రెండేళ‍్లలో 26 వేల మెగావాట‍్ల విద్యుత్‌ ఉత‍్పత్తి చేస్తామని విద‍్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర‍్కొన్నారు.  మంత్రి బుధవారం పాల‍్వంచ కేటీపీఎస్‌ను సందర్శించారు. మణుగూరులలోని భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్‌కు త‍్వరలో పర్యావరణ అనుమతులు మంజూరవుతాయని మంత్రి చెప్పారు. భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్‌ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని పేర‍్కోన‍్నారు.
మరిన్ని వార్తలు