అయితే అప్పుల భారతదేశమనాలా?: కేటీఆర్‌

17 Mar, 2017 14:44 IST|Sakshi
అయితే అప్పుల భారతదేశమనాలా?: కేటీఆర్‌
హైదరాబాద్‌: బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా మండలిలో మంత్రి కేటీర్, ఎమ్మెల్సీ రాంచంద్రరావు మధ్య వాడివేడిగా చర్చ సాగింది. బంగారు తెలంగాణను బకాయిల తెలంగాణగా మార్చారని రాంచంద్రరావు ఆరోపించగా.. రాష్టం బకాయిల తెలంగాణ అయితే దేశాన్ని బకాయిల భారత దేశం అనాలా అని మంత్రి ఎదురుదాడికి దిగారు. అప్పుల విషయంలో రాష్ట్రాన్ని బకాయిల రాష్టం చేస్తున్నారని రాంచంద్రరావు అనగా.. రుణామాఫీల వల్ల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్న మోదీ, యూపీ ఎన్నికల సందర్బంగా రైతు రుణమాఫీని ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. రాష్ట్రానికో న్యాయం, యూపీకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.
 
రుణమాఫీ చెల్లించాలని ప్రధానిని కలుద్దామంటే తామూ వస్తామని కేటీఆర్ అన్నారు. గత బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయలేదు, ఈసారి కేటాయింపులు భారీగా తగ్గించారన్న రాంచంద్రరావు వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. కేటాయింపులు తగ్గాయని, సరిగ్గా ఖర్చు చేయలేదనే నిందారోపణలు సరికాదన్నారు. బీజేపీ ఏలుబడిలో ఉన్న కొత్త రాష్ట్రాలు ఇంకా కుదుట పడలేదు... తెలంగాణ మాత్రం రెండేళ్లలోనే నంబర్ వన్ స్థాయికి చేరిందంటే దాని వెనుక ప్రభుత్వ కృషిని గమనించాలని కోరారు.
 
మరిన్ని వార్తలు