పక్కింటి పద్మావతితో ప్రేమాయణం.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా

15 Feb, 2020 16:19 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ఓ డాక్టర్‌ అరుదైన ఘనత సాధించాడు. కలాబురాగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి వైద‍్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. 2002 వారి పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు అప్పటికే వివాహం కావడంతో వీరి వ్యవహారం భర్తకు తెలిసింది. దీంతో వీరివురిని హెచ్చరించడంతో ఎలాగైనా అతడిని అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్‌ చేసి చంపేశారు. ఈ కేసులో ఇద్దరూ శిక్ష అనుభవించి 2016లో విడుదలయ్యారు.  (భారత్‌లో బాలుడి హత్యకు లండన్‌లో కుట్ర!)

జైలు జీవితాన్ని పూర్తి చేసి బయటకు వచ్చిన తదనంతరం సుభాష్ తన చదువును కొనసాగించాలని అనుకున్నాడు. క్షణికావేశంలో చేసిన తప్పుతో పరివర్తన చెందిన సుభాష్‌ తిరిగి ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించుకొని 2019లో కోర్సు పూర్తి చేశాడు. తాజాగా.. ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి కావడంతో కర్ణాటకలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జైలులో గడిపినన్ని రోజులు చదవడంపైనే దృష్టి పెట్టినట్టు తెలిపారు. వైద్యుడిగా ప్రజలకు మంచి సేవలు అందించడమే తన ముందున్న లక్ష్యమని చెబుతున్నారు. అంతేగాక తన తోటి వారికి క్షణికావేశంలో తప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నాడు.

పెళ్లింట తీవ్ర విషాదం: డాన్స్‌ చేస్తూ వరుడు మృతి!

>
మరిన్ని వార్తలు