నేతాజీ స్నేహితుడి భార్యకూ పింఛను కరువు

16 Aug, 2016 01:33 IST|Sakshi

 కేకేనగర్: తిరువారూర్ జిల్లా ముత్తుపేట రోడ్డులో నివసిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ కెఎస్ మహ్మద్‌దావూద్ (99) బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్‌ఏ బృందంలో విశిష్ట సేవలు అందించారు. ఒకసారి బర్మాలో జరిగిన కార్యక్రమానికి నేతాజీ మారువేషంలో వచ్చారు. ఆయన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న మహ్మద్ దావూద్ మారువేషంలో వచ్చింది నేతాజీ అని తెలిసిన అనంతరమే ఆయన్ను అనుమతించారు.
 
  దావూద్ నిజాయితీని ఎంతగానో మెచ్చుకున్న నేతాజీ అప్పటినుంచి ఇతడితో సన్నిహితంగా మెలిగేవారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన ద్వారా జీవితాన్ని గడిపిన మహ్మద్ దావూద్ గత సంవత్సరం మరణించాడు. అప్పటి నుంచి ఆయన సతీమణి సబురా అమ్మళ్‌కు పెన్షన్ అందించడం లేదు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసి వినతి ప్రతం సమర్పించినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మట్లాడుతూ భర్త చనిపోయినప్పటి నుంచీ తనకు పింఛన్ మంజూరు కావడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు పెన్షన్ మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  
 

మరిన్ని వార్తలు