సోనియూ, రాహుల్ దిష్టిబొమ్మల దహనం

23 Feb, 2014 00:42 IST|Sakshi
సోనియూ, రాహుల్ దిష్టిబొమ్మల దహనం

వేలూరు, న్యూస్‌లైన్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్, శాంతన్, పేరరివాలన్ విడుదలను అడ్డుకోవడాన్ని ఖండిస్తూ నామ్ తమిళర్ పార్టీ నాయకులు వేలూరు సెంట్రల్ జైలు ఎదుట శనివారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

 

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సోని యూ, రాహుల్ గాంధీల దిష్టి బొమ్మలను జైలు వద్దకు తీసుకొచ్చి చెప్పులతో కొట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పటికే జైలు ఎదుటనున్న పోలీసులు అక్కడ కు చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు విన్సెం ట్, కార్యదర్శి శివ, యువకులు పాల్గొన్నారు.
 విడుదల చేస్తారు: న్యాయవాది పుగళేంది

 

 వేలూరు సెంట్రల్ జైలులో ఉన్న నళినితో పాటు మరో నలుగురిని విడుదల చేస్తారన్న నమ్మకం తనకు ఉందని న్యాయవాది పుగళేంది తెలిపారు. శనివారం మధ్యాహ్నం పురుషుల జైలులోని మురుగన్, శాంతన్, పేరరివాలన్, మహిళా జైలులోని నళినిని ఆయన పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురిని విడుదల చేస్తామని ప్రకటించిందని అందులో ఉరిశిక్ష రద్దు చేసిన మురుగన్, శాంతన్, పేరరివాలన్‌లను విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఆటంకం కల్పించిందన్నారు అయితే నళినితో పాటు రాబర్ట్ పయాస్, జయకుమార్, మొత్తం నలుగురిని విడుదల చేసేందుకు ఎటువంటి ఆటంకం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినోత్సవం రోజున నలుగురిని విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నామన్నారు. దీనిపై మాట్లాడేందుకే తాను జైలుకు వచ్చానన్నారు
 

మరిన్ని వార్తలు