శశికళ తనయుడికి మంత్రి పదవి!

16 Feb, 2017 15:27 IST|Sakshi
శశికళ తనయుడికి మంత్రి పదవి!

చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన పళనిస్వామి మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. తన కేబినెట్‌ లో కొత్త ముఖాలకు చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. శశికళకు సన్నిహితులైన వారికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శశికళ తనయుడు(అక్క కుమారుడు) దినకరన్‌,  సెంగొట్టయ్యన్‌ లకు కేబినెట్‌ బెర్తులు ఖాయమంటున్నారు.

సీఎం సహా 33 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పోయెస్‌ గార్డెన్‌ ముఖ్యనేతలతో కేబినెట్‌ కూర్పుపై పళనిస్వామి చర్చించారు. అనంతరం తన మద్దతుదారులతో కలిసి రాజ్‌ భవన్‌ కు బయలుదేరారు. మంత్రుల పేర్లతో కూడిన లిస్టును గవర్నర్‌ ను అందించారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు.