ఇంటిలోకి చొరబడిన పాము

11 Dec, 2015 09:32 IST|Sakshi

తిరువళ్లూరు : తిరువళ్లూరు సమీపంలోని వెన్‌మనముదూర్ ప్రాంతంలోని నివాస ప్రాంతంలో చొరబడిన నాగుపామును అగ్నిమాపక సిబ్బంది పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. తిరువళ్లూరు జిల్లా వెన్‌మనముదూర్ గ్రామంలో ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి  చెందిన రాజేంద్రన్ ఇంటిలోకి నాగుపాము చొరబడడం చూసి ప్రజలు పరుగులు పెట్టారు. 

నాగుపాము చొరబడడంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అడుగుల నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా వెన్‌మనముదూర్ ప్రాంతంలో నాగుపాము నివాస ప్రాంతంలో చొరబడడం స్థానికంగా సంచలనం కలిగించింది.

మరిన్ని వార్తలు