మూడోసారీ ముక్కోణపు పోటీ

7 Feb, 2015 02:02 IST|Sakshi

న్యూఢిల్లీ : నగర ఓటర్లు ఆరోసారి విధానసభను ఎన్నుకోనున్నారు. దేశరాజధానిలో విధానసభ  ఏర్పాటైన తర్వాత 1993లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆనాటి న్నికలలో 61.75 శాతం ఓటింగ్ నమోదైంది. అప్పుడు కూడా ముక్కోణపు పోటీ జరిగింది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే అయినప్పటికీ  జనతాదళ్ కూడా ఎన్నికల బరిలోకి దిగింది, తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బదర్‌పుర్ నుంచి పోటీచేస్తున్న రామ్‌వీర్ సింగ్ బిధూడీ నేతృత్వంలో పోటీచేసిన జనతాదళ్‌కు కూడా గణనీయంగానే ఓట్లు పడ్డాయి. అయితే బీజేపీ భారీ మెజారిటీతో  గెలిచి మదన్‌లాల్ ఖురానా నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఆ తరువాత జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ జరిగింది.

ఈ మూడుసార్లు స్థానికులు షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కే అధికారం కట్టబెట్టారు. అయితే మళ్లీ 2013 నాటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రంగ ప్రవేశం చేసింది. దీంతో   మరోసారి ముక్కోణపు పోరు  జరిగింది. ఓట్ల చీలిక కారణంగా ఏపార్టీకి పూర్తి మెజారిటీ లభించలేదు. దీంతో 14 నెలలకే మరోసారి ఎన్నికలు జర పక తప్పలేదు.
 

మరిన్ని వార్తలు