ఎల్లంపల్లి పైప్‌లైన్ లీక్
20 Jan, 2017 15:54 IST|Sakshi
ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్‌లైన్ లీకేజీ అయింది. ఎయిర్ గేట్ వాల్వ్ ఎగిరిపోవటంతో నీరు 100 అడుగుల ఎత్తులో ఎగసిపడుతోంది. దీంతో సమీప పొలాల్లోకి నీరు వృథాగా పోతోంది. ప్రెషర్ తగ్గిన తర్వాతే మరమ్మతులు చేపట్టడం వీలవుతుందని అధికారులు తెలిపారు.