ఔను.. ప్రేమలో పడ్డాను!

23 Nov, 2014 12:53 IST|Sakshi
ఔను.. ప్రేమలో పడ్డాను!

నటి ప్రియమణి రహస్య వివాహం చేసుకున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. పరుత్తివీరన్ చిత్రంతో కోలీవుడ్ దృష్టిని తనపై పడేలా చేసుకున్న మాలీవుడ్ బ్యూటీ ప్రియమణి. ఆ చిత్రంలో ముత్తళిగి పాత్రలో జీవించి జాతీయ అవార్డును అందుకున్న ఈ భామ  ఆ తరువాత కమర్షియల్ పాత్రపై మోహం పెంచుకుని కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తరువాత అవకాశాలు దూరం అవడంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ కొన్నిఅవకాశాలను దొరకపుచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది.
 
 అరుుతే తాజాగా కన్నడ నటుడు గోవింద్ పద్మ సూర్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ప్రియమణి కొట్టి పారేసింది. అవన్నీ వదంతులేనని తేల్చి చెప్పేసింది. ఈ వదంతులపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతం తాను అంబిరిషా అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో దర్శిన్ హీరోగా నటిస్తున్నారని చెప్పారు. ఇందులో పొగరుబోతు అమ్మాయిగా నటిస్తున్నానని తెలిపింది. ఎప్పుడూ బిజినెస్, డబ్బు గురించే ఆలోచించే అమ్మాయి పాత్ర అని వెల్లడించింది.
 
 ఎవరినీ తనకు సమఉజ్జీగా భావించకుండా తన మాటే వినాలనే మనస్తత్వం గల యువతిగా నటిస్తున్నానని చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే పడయప్పా చిత్రంలో నీలాంబరి తరహా పాత్ర తనదని తెలిపింది. ఇకపోతే తనకు పెళ్లి అయ్యిందనే ప్రచారం తరచూ జరుగుతోందని ఈసారి వరుడి పేరు కూడా ప్రస్తావిస్తూ వదంతులు ప్రచారం చేసేస్తున్నారని అంది. నిజానికి అలాంటిది ఏదైనా జరిగితే ముందుగా మీకే తెలియచేస్తానని అంది. తానొకరిని ప్రేమిస్తున్న విషయం నిజమే కానీ, అది గోవింద పద్మ సూర్య కాదని, సమయం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెబుతానని ప్రియామణి పేర్కొంది.
 

మరిన్ని వార్తలు