డేటాలీక్‌పై జియో యూ టర్న్‌

13 Jul, 2017 10:48 IST|Sakshi
డేటాలీక్‌పై జియో యూ టర్న్‌

న్యూడిల్లీ: వినియోగదారుల  వ్యక్తిగత సమాచారం అత్యంతర భద్రం, డేటా లీక్‌ కాలేదంటూ ప్రగల్భాలు పలికిన  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్  యూ టర్న్‌ తీసుకుంది.  తమ వినియోగదారుల సమాచారం లీక్ అయిందంటూ పోలీసులకు  అందించిన ఫిర్యాదులో  పేర్కొనడం కలకలం రేపింది.  డేటా మేజర్‌ లీక్‌ అయిందంటూ జియో  తమకు ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి బుధవారం తెలిపారు.

తమ కంప్యూటర్‌ వ్యవస్థలోకి అక్రమ చొరబాట్లు జరిగాయంటూ ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రిలయన్స్‌ జియో ఆరోపించిందని  దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ కస్టమర్ల సమాచారం భారీగా లీక్‌ అయిందన్న వార్తలను  నమ్మొద్దంటూ కొట్టిపారేసిన జియో,  డేటాలీక్‌ను అధికారికంగా ధృవీకరించినట్టయింది.

ఈ వ్యవహారంపై బెంగళూరుకు చెందిన  వెబ్ భద్రతా సలహాదారు  ఆకాష్ మహాజన్ స్పందిస్తూ డేటాలీక్‌  అనేది కంపెనీ భద్రతా డొల్లతనాన్ని ప్రదర్శిస్తుందన్నారు.  అందుకే ఇండియాలో  చాలా కంపెనీలు డేటా ఉల్లంఘనలను తరచూ అంగీకరించడం లేదని పేర్కొన్నారు.

కాగా మాజిక్‌ ఏపీకే వెబ్‌సైట్‌లో జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం ఆందోళన రేపింది. వినియోగదారుల ఈమెయిల్‌,   ఆధార్‌నెం, మొబైల్‌ నంబర్లను ఈ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి.  మరోవైపు  లీకేజీకు సంబంధించి  రాజస్థాన్‌కు ఇమ్రాన్‌ చింపా అనే  యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు చింపాను ముంబైకి తరలించి  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66 లోని సెక్షన్‌, ఇండియన్ పీనల్ కోడ్ యొక్క 379 సెక్షన్.  ప్రకారం కేసు నమోదు చేశారు. దాదాపు 12 కోట్ల మంది జియో వినియోగదారులు తన ఆధార్‌ కార్డ్‌ నమోదు  ద్వారా జియో సిమ్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు