హార్టీకల్చర్‌ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ 

22 Oct, 2023 06:30 IST|Sakshi
బీఎస్‌సీ హార్టీకల్చర్‌లో సీటు పొందిన విద్యార్థినికి పత్రాలు అందజేస్తున్న ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకీరామ్‌

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 11 ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హార్టీసెట్‌–2023లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా బీఎస్సీ హార్టీకల్చర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో జరిగిన ఈ కౌన్సెలింగ్‌కు 300 మంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీసీ టి.జానకీరామ్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యాన విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు, ప్రైవేటు యాజమాన్యంలోని నాలుగు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో హార్టీసెట్‌ ద్వారా బీఎస్సీ హార్టీకల్చర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి మొత్తం 92 సీట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యాన కళాశాలల్లో 52 సీట్లు, ప్రైవేటు ఉద్యాన కళాశాలల్లో 40 సీట్లకు ఈ కౌన్సెలింగ్‌ జరిగింది.

మరిన్ని వార్తలు