బీఫ్‌ కాదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు!

13 Jul, 2017 11:13 IST|Sakshi
బీఫ్‌ కాదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు!

నాగ్‌పూర్‌: నాగ్‌పూర్‌లోని భార్‌సింగీలో దారుణంలో చోటుచేసుకుంది. బీఫ్‌ (పశుమాంసం) తీసుకెళుతున్నాడన్న నెపంతో 40 ఏళ్ల వ్యక్తిపై నలుగురు దాడి చేశారు. ఇస్మాయిల్‌ షా అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళుతుండుగా నలుగురు వ్యక్తులు అటకాయించి.. బీఫ్‌ ఎందుకు తీసుకెళుతున్నావని బెదిరించారు. తాను తీసుకెళుతున్న మాంసం బీఫ్‌ కాదని షా ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అతనిపై దాడి చేసి కొట్టారు. ప్రహార్‌ సంఘటనకు చెందిన వ్యక్తులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దేశంలో బీఫ్‌ పేరిట దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. బీఫ్‌ తీసుకెళుతున్నాడన్న నెపంతో హర్యానాలోని స్థానిక రైలులో 16 ఏళ్ల జునైద్‌ను కొట్టి చంపిన ఘటన దేశమంతటా ప్రకంపనలు రేపింది. 'నాట్‌ఇన్‌మైనేమ్‌' పేరిట గోరక్షక దాడులు, బీఫ్‌ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి.