రాష్ట్రానికి 12 పోలీసు పతకాలు

15 Aug, 2018 02:04 IST|Sakshi
సందీప్‌ శాండిల్యా, కమలాసన్‌రెడ్డి, బి.సైదయ్య

     2 రాష్ట్రపతి విశిష్ట, 10 అత్యుత్తమ సేవా పతకాలు 

     జాబితాలో ఐపీఎస్‌లు సందీప్‌ శాండిల్యా, కమలాసన్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రకటించే ఈ పతకాల్లో తెలంగాణకు 12 దక్కాయి. వీటిలో రెండు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 అత్యుత్తమ సేవా పతకాలున్నాయి. రైల్వే, రోడ్డు భద్రతల శాఖ అడిషనల్‌ డీజీపీ సందీప్‌ శాండిల్యా, హైదరాబాద్‌ టీఎస్‌ సెల్‌ మాల్నీది కృష్ణలకు విశిష్ట సేవా పతకాలు దక్కాయి. కరీంనగర్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డితోపాటు మరో 9 మందిని అత్యుత్తమ సేవా పతకాలు వరించాయి. 2019 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా సంబంధిత అధికారులు ఈ పతకాలు స్వీకరించనున్నారు. పతకాలు పొందిన అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు.  

ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి శౌర్య పతకాలు 
పలువురు రాష్ట్ర అగ్నిమాపక సిబ్బందినీ రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి. ఫైర్‌మన్లు దేవరం కొర్రా, భీంరావ్‌ అనికెలిలు రాష్ట్రపతి శౌర్య పురస్కారాలకు.. లీడింగ్‌ ఫైర్‌మన్‌ సుధాకర్‌రెడ్డి బుర్రా, ఫైర్‌మన్‌ మహ్మద్‌ అక్బర్‌ అత్యుత్తమ సేవా పతకాలకు ఎంపిక అయ్యారు. 

జైళ్ల శాఖ సిబ్బందికీ.. 
జైళ్ల శాఖలో హైదరాబాద్‌ డిప్యూటీ ఐజీ బి.సైదయ్య, చర్లపల్లి కేంద్ర కారాగారం హెడ్‌ వార్డర్‌ బి.బాలకృష్ణారెడ్డి, వార్డర్‌ టి.భాస్కర్‌చారి, వరంగల్‌ కేంద్రకారాగం చీఫ్‌ హెడ్‌ వార్డన్‌ మహ్మద్‌ అన్వర్‌జియాలకు అత్యుత్తమ సేవా పతకాలు దక్కాయి.  

అత్యుత్తమ సేవా పతకాలకు ఎంపికైన వారు
- వీబీ కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్‌ 
జక్కుల శ్రీనివాస్‌రావు, డీఐజీ కమ్యూనికేషన్స్, సైఫాబాద్‌ 
ఎంజీఎస్‌ ప్రకాశ్‌రావు, అసిస్టెంట్‌ కమాండెంట్, వరంగల్‌ 
మెట్టు మానిక్‌రాజ్, అడిషనల్‌ డీసీపీ, హైదరాబాద్‌ 
సి.రఘునందన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ ఇంటెలిజెన్స్, హైదరాబాద్‌ 
జి.రాజులు, ఎస్సై సీఐడీ, సిద్దిపేట 
మనోజ్‌కుమార్‌ దూబే, ఏఆర్‌ హెచ్‌సీ, హైదరాబాద్‌ 
రమావత్‌ పెంటయ్య, హెచ్‌సీ ఐఎస్‌డబ్ల్యూ, హైదరాబాద్‌ 
కె.రాంప్రసాద్, హెచ్‌సీ, నిజామాబాద్‌ 
ఎల్‌ మరియన్న బట్టు, ఏఆర్‌ఎస్సై, కొత్తగూడెం–భద్రాది 

మరిన్ని వార్తలు