వికటించిన మధ్యాహ్న భోజనం

19 Dec, 2015 17:00 IST|Sakshi
వికటించిన మధ్యాహ్న భోజనం

ఖానాపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం నర్సాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్న  భోజనం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బడిలో చదువుకునే బాలల్లో 23 మంది వాంతులు, కడుపునొప్పితో బాధపడటంతో అందరినీ ఖానాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. వారిలో ఐదుగురికి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు