వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఖరారు

19 Dec, 2015 17:05 IST|Sakshi

- గ్రేటర్ మాదిరే అక్కడా మహిళలకు 50 శాతం సీట్ల కేటాయింపు
 
హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో డివిజన్ల రిజర్వేషన్లను ఖరారుచేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్ మాదిరే ఈ రెండు కార్పొరేషన్లలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించడం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయా కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.

వరంగల్ కార్పొరేషన్: మొత్తం డివిజన్లు- 58
మహిళలకు కేటాయించినవి- 29
వీటిలో ఎస్టీ మహిళ- 1, ఎస్సీ మహిళ- 4, బీసీ మహిళ- 9, జనరల్- 15

అన్ రిజర్వుడ్(ఎవరైనా పోటీచేయగల స్థానాలు)- 29
ఇందులో ఎస్టీ- 1, ఎస్టీ- 5, బీసీ- 10, జనరల్- 13

ఖమ్మం కార్పొరేషన్: మొత్తం డివిజన్లు- 50
మహిళలకు కేటాయించినవి- 25
వీటిలో ఎస్టీ మహిళ- 1, ఎస్సీ మహిళ- 3, బీసీ మహిళ- 8, జనరల్- 13

అన్ రిజర్వుడ్ (ఎవరైనాపోటీచేయగల స్థానాలు)- 25
ఇందులో ఎస్సీ- 1, ఎస్టీ- 3, బీసీ-9, జనరల్- 12

జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలతో ఆ మేరకు ముందుకు కదిలిన సర్కార్  ఓటర్ల జాబితాను సిద్ధంచేయడంతోపాటు రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. అయితే ఏయే డివిజన్లు రిజర్వ అవుతాయి, ఏవి జనరల్ కేటగిరీలో ఉంటాయనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు సంబంధించి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సిఉంది.

>
మరిన్ని వార్తలు