ఆ రైతు కుటుంబాలకు రూ.39 లక్షలు

31 May, 2019 05:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 49 రైతు కుటుంబాలకు ఊరట లభించింది. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార కార్పొరేషన్‌ ద్వారా కేటగిరీ–1 యూనిట్ల కింద ఆ కుటుంబాలను ఆర్థిక సహకార పథకాలకు ఎంపిక చేసిన ప్రభుత్వం, తాజాగా నిధులు విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఉపాధి యూనిట్లు తెరుచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందులో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ రూపం లో ఇస్తుండగా, 20 శాతాన్ని లబ్ధిదారు వ్యక్తిగతంగా భరించడమో లేదా బ్యాం కు రుణం తీసుకోవడంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఇందులో భాగంగా 49 మందికి 80 శాతం రాయితీ కింద ఒక్కో కుటుంబానికి రూ.80 వేల చొప్పున మొత్తం రూ.39.20 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం గురువారం ఆదేశాలు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు