పోలీసు సిబ్బందిని భయపెడుతున్న దెయ్యం! 

29 Oct, 2023 08:59 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దెయ్యం ఉందంటూ పుకార్లు సాగుతున్నాయి. దీంతో రాత్రి వేళలో నిద్రిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే వారు సైతం కార్యాలయంలో దెయ్యం ఉన్నట్లు సిబ్బందితో తెలిపిన ట్లు సమాచారం.

ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి మాంత్రికుడిని తీసుకొ చ్చి అక్కడి మరుగుదొడ్లను చూపించగా.. అక్క డ దెయ్యాలున్నాయని చెప్పడంతో కొంత మంది ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డీఈవో విషయాన్ని జన విజ్ఞాన వేదిక దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి సిబ్బందితో పాటు వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, రవీందర్‌రెడ్డితో పాటు జిల్లా సైన్స్‌ అధికారి రఘురమణ రాత్రి సమయంలో కార్యాలయంలో నిద్రించారు. తమకు ఎలాంటి శబ్ధాలు వినిపించలేదని, దెయ్యం ఉన్నట్లు వస్తున్న పుకార్లు అవాస్తవమని స్పష్టం చేశారు.

ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా, దెయ్యాలు లేవని, కావాలనే కొంత మంది పుకార్లు చేస్తున్నారని వివరించారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించడం ఇష్టం లేకనే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలను దూరం చేసి శాస్త్రీయ దృక్పదా న్ని పెంపొందించాలి్సన విద్యాశాఖలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చోద్యంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు