కంది కొనుగోలుకు 80 కేంద్రాలు

24 Jan, 2017 02:45 IST|Sakshi

కందులకు మద్దతు ధరపై సమీక్షలో మంత్రి హరీశ్‌
2.17 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో కందులకు మద్దతు ధర ఇచ్చేందుకు 80 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇప్పటివరకు 68 కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు. కంది మద్దతు ధర చెల్లింపు, సేకరణపై మార్కెటింగ్, ఎఫ్‌సీఐ, నాఫెడ్, హాకా, డీసీఎంఎస్, వ్యవసాయాధి కారులతో సోమవారం ఆయన సమీక్షిం చారు. మద్దతు ధర అందించాలని, దళారు లను అరికట్టాలనే ఉద్దేశంతో పట్టాదారు పాసుపుస్తకాల ద్వారా కొనుగోలు చేయా లని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 20,720 మంది రైతుల నుంచి 2,17,628 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసి రూ.50 కోట్లు చెల్లించామన్నారు. మిగిలిన మొత్తం కూడా రైతులకు వెంటనే చెల్లించాల్సిందిగా ఆదే శింశామన్నారు. కందిS కొనుగోళ్లలో సమ స్యలుంటే రాష్ట్రస్థాయిలో ఫిర్యాదుల పరి ష్కారానికి మార్కెటింగ్‌శాఖ కార్యాలయం లో ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశా మన్నారు. 040–23222306 నంబర్‌కు ఫిర్యాదులు చేయొచ్చన్నారు.

ప్రతి సోమ వారం మార్కెటింగ్‌ డైరెక్టర్‌ సమీక్ష నిర్వ హించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. కందుల రెగ్యులేషన్‌ జరుగుతున్న మార్కెట్‌ యార్డుల్లో ప్రభుత్వ ఏజెన్సీలు కొన్న తర్వాత ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే సమయంలో గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఆయా కార్యదర్శులు తగిన జాగ్రత్తలు తీసుకొని రైతుకు మంచి ధర వచ్చేలా చూడాలని చెప్పారు. వివాదాల పరిష్కారానికి కమిటీలు వేయాలన్నారు. రైతులు 12 శాతం తేమ మించకుండా కందులను యార్డుకు తీసుకొచ్చేలా ఆయా మార్కెట్‌ యార్డుల తరపున ప్రచారం చేయాలన్నారు. రైతు సరుకును యార్డుకు తీసుకొచ్చి కుప్పపోసేందుకే చార్జీలు చెల్లిం చాలని.. ఏ ఇతర చార్జీలు రైతులు చెల్లిం చాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కొనుగోలుకు సంబంధించి తూకం, హమా లీ అన్నింటినీ ప్రభుత్వ ఏజెన్సీలే భరిస్తా యన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

తాత్కాలిక మార్కెట్‌ యార్డుల్లోని గోదాముల్లోకి కందులు చేరిన వెంటనే ఇన్‌వాయిస్‌ బిల్లులు తయారుచేసి రైతులకు డబ్బులందేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. దేశం నుంచి కంది ఎగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసేం దుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖపై అధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. కల్వకుర్తి, కొల్హాపూర్‌లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కె టింగ్‌ శాఖ అధికారులు ఆయా మార్కెట్ల లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్‌రావు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ జి.లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్‌ జీఎం రేఖ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు