ఆధార్‌ ఉంటేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌!

24 May, 2017 11:21 IST|Sakshi
ఆధార్‌ ఉంటేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌!
హైదరాబాద్‌: ఇక నుంచే ఆధార్‌ కార్డు ఉంటేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయనున్నారు. ప్రస్తుతం లైసెన్సు జారీలో ఆధార్‌ కార్డును పొందుపరుస్తున్నప్పటికీ తప్పనిసరి అనే నిబందన లేదు. లైసెన్సు దారుడి సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది.
 
దీంతో ప్రమాద సంబందిత కేసుల విచారణ సులభతరం అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిబందనను అమలులోకి తేవాలని రవాణాశాఖ భావిస్తుంది. గతంలో కూడా రవాణా శాఖ ఈ నిబందనను అమలు చేసి రద్దు చేసింది. బ్యాంకులు, ఇతర లావాదేవీలతోపాటు ప్రతి దానికి ఆధార్‌ను జతపరుస్తుండటంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కూడా తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు.
మరిన్ని వార్తలు