రాష్ట్ర స్థాయిలో అక్రెడిటేషన్ కౌన్సిల్

24 Nov, 2016 03:54 IST|Sakshi

- ఏర్పాటు దిశగా ఉన్నత విద్యా మండలి కసరత్తు
- కాలేజీల్లో నాణ్యతాప్రమాణాల పెంపుపై దృష్టి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యా సం స్థల్లో నాణ్యత ప్రమాణాల పెంపుపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఉన్నత విద్యా సంస్థలకు నేషనల్ అసెస్‌మెంట్ ఆఫ్ అక్రెడి టేషన్ కౌన్సిల్(న్యాక్) ఇచ్చే గుర్తింపు తరహాలోనే నాణ్యత ప్రమాణాలను బట్టి రాష్ట్ర స్థారుులో గుర్తింపు ఇచ్చే సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. స్టేట్ అసెస్‌మెంట్ ఆఫ్ అక్రె డిటేషన్ కౌన్సిల్‌ను(స్యాక్) ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యా సంస్థలను ఉత్తమ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దడంతోపాటు న్యాక్ గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టవచ్చని, న్యాక్ గుర్తింపు ఉంటే రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షాఅభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రంలోని విద్యా సంస్థలకు భారీ మొత్తంలో నిధులను రాబట్టుకో వచ్చనే ఆలోచనకు వచ్చింది.

ఇందులో భాగంగానే స్యాక్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జి చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం, వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ వెల్లడించారు. రూసా నిధు లను ఎక్కువ మొత్తంలో రాబట్టుకోవాలంటే న్యాక్ అక్రెడిటేషన్ తప్పనిసరి అని చెప్పారు. డిసెంబర్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాళ్లతో న్యాక్ అక్రెడిటేషన్ పొందేందుకు కాలేజీలు చేపట్టాల్సిన చర్యలపై సెమినార్ నిర్వహిస్తామని వివరించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా న్యాక్ డెరైక్టర్‌ను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల కేరళ లో పర్యటించి  అక్కడ అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాల్లో ప్రధానంగా ఐదింటిని గుర్తించి రాష్ట్రంలో అమలు చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చామని, త్వరలోనే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలోనూ అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడతామని ఇన్‌చార్జి చైర్మన్ వివరించారు.

మరిన్ని వార్తలు