నిమజ్జానానికి ఏర్పాట్లు పూర్తి: ఏసీపీ అనిల్‌

11 Sep, 2019 16:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అడిషనల్‌ సీపీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. 11వ రోజున బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 18కిలోమీటర్ల మేర శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 17 ప్రధాన రహదారుల మీదుగా శోభయాత్ర కొనసాగనుందని.. 10వేల లారీలు దీనిలో పాల్గొంటాయన్నారు. అలిబాద్‌, నాగులచింత, చార్మినార్‌, మదీన, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా శోభయాత్ర కొనసాగుతుందని దీనికి అనుగుణంగా ట్రాఫిక్‌ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. నిమజ్జనం చూడ్డానికి విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారని తెలిపారు.

శోభయాత్రలో ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించుకోవాలని కోరారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగ్‌ కాలనీ, గోసేవ సధన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్‌ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్‌ స్టేడియం, పబ్లిక్ గార్డెన్‌ వంటి పది చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6గంటల నుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. మొత్తం 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు