కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత

21 May, 2015 01:58 IST|Sakshi
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత

- అలిగిన పార్టీ సీనియర్లు
 
హైదరాబాద్:
శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఆమె గురువారం ఉదయం నామినేషన్ వేయనున్నట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం వెల్లడించారు. ఎమ్మెల్సీ సీటు కోసం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు పొన్నాల వైశాలి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. వీరితో పాటు మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌తో పాటు పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు చెందిన 40 మంది సీనియర్లు చివరిదాకా ప్రయత్నించారు. ఆకుల లలితను అధిష్టానం ఎంపిక చేయడంతో పలువురు సీనియర్లు అలకబూనారు.

దానం నాగేందర్ రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆకుల లలిత ఎంపికపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హర్షం ప్రకటించారు. మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా అవమానించిన టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చెంప దెబ్బ వంటిదని పొన్నం వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్షం అసెంబ్లీలోని కార్యాలయంలో గురువారం సమావేశం కానుంది. ఆకుల లలిత అభ్యర్థిత్వంపై ఈ భేటీలో అధికారిక ప్రకటన, అనంతరం నామినేషన్ ప్రక్రియ ఉంటుందని విప్ సంపత్‌కుమార్ వెల్లడించారు.

పార్టీలో కొనసాగలేను: దానం ఈమెయిల్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆకుల లలితను ఎంపిక చేయడం చాలా పెద్ద తప్పు అని, పార్టీ సీనియర్లను అవమానిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీలో కొనసాగలేనంటూ అధిష్టానవర్గానికి దానం నాగేందర్ ఈమెయిల్ చేసినట్లుగా తెలిసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

జైపాల్‌ రెడ్డి సతీమణికి సోనియా లేఖ

బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్‌

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

‘జైపాల్‌, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

చెట్టెక్కింది..పక్షి పిల్లలను మింగేసింది

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

అక్బర్‌ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు  

'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'

నక్సల్‌బరి సృష్టికర్తకు వందేళ్లు

'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'

పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

జైపాల్‌రెడ్డి మృతి ; ప్రధాని సంతాపం

'దేశంలోని ఆలయాలన్నీ తిరిగా'

భార్య కాటికి.. భర్త పరారీ..

తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

‘ఆ విషయాలే మమ్మల్ని మిత్రులుగా చేశాయి’

వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు

అలుపెరగని రాజకీయ యోధుడు

లాల్‌దర్వాజా బోనాలు నేడే

ఇదే మెనూ.. పెట్టింది తిను

జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అక్కడే..!

ఇక అంతా.. ఈ–పాలన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?