అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

24 Jul, 2018 13:54 IST|Sakshi
అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం 

గంభీరావుపేట(సిరిసిల్ల) : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌)ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ఏటా ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చే స్తున్నా.. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే టీచర్లు, చిన్నారులు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరత కారణంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉ ంటున్నాయి. వాటిని పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించడం లేదు.

54 అంగన్‌వాడీ కేంద్రాలు.. ఒక్కరే సూపర్‌వైజర్‌

గంభీరావుపేట మండలంలో 53 అంగన్‌వాడీ కేంద్రాలు, ఒక మినీ అంగన్‌వాడీ కేంద్రం ఉంది. గంభీరావుపేట, లింగన్నపేట సెక్టార్ల పరి«ధిలో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలను ఒక్కరే సూపర్‌వైజర్‌ పర్యవేక్షిస్తున్నారు. 

అద్దె ఇళ్లలో 13 కేంద్రాలు

మండలంలోని 15 అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 13 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అదే విధంగా అద్దె లేకుండా వివిధ పాఠశాల భవనాల్లో 26 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. 

అసంపూర్తిగా ఏడు భవనాలు..

మండలంలోని కొత్తపల్లి, గజసింగవరం, ముస్తఫానగర్, సముద్రలింగాపూర్, దమ్మన్నపేట, నర్మాల క్యాంపు, గోరింటాల గ్రామాల్లో పక్కా భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే, అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటన్నింటికీ పక్కా భవనాలు మంజూరు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా, అద్దె రూపంలో నెలనెలా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు సొంత భవనాల నిర్మాణాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

తప్పని ఇబ్బందులు

ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో పిల్లల ఆటవస్తువులు, వంట సామగ్రి, బియ్యం అన్నీ ఒకే చోట ఉంచలేక నిర్వహకులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, కిశోరబాలికలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలును ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగించింది. పథకాలు అమలు చేయడానికి పక్కా భవనాలు లేకు, అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక అంగన్‌వాడీ టీచర్లు తీవక్ర ఇబ్బందులు పడుతున్నారు. 

తక్కువ అద్దె కారణంగా..

ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి రూ.750 చొప్పున అద్దె చెల్లిస్తోంది. గత మార్చి వరకు అద్దె నిధులను విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి బిల్లులు రావాల్సి ఉంది. తక్కువ అద్దెతో సౌకర్యవంతమైన గదులు కూడా దొరకడం లేదని, అద్దె ఇళ్లు సక్రమంగా దొరకడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏప్రిల్‌ నుంచి అద్దెను రూ.వెయ్యికి పెంచే అవకాశం ఉన్నట్లు ఐసీడీఎస్‌ అధికారులు భావిస్తున్నారు.

అద్దె రూపంలో ఏటా గంభీరావుపేట మండలంలో రూ.1.17 లక్షల చొప్పున నిధులు ఖర్చు అ వుతున్నాయి. నిధులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు త ప్ప పక్కా భవనాల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.  

మరిన్ని వార్తలు