ఆలయ ప్రహరీపై హనుమాన్‌ ఆకారం

27 Dec, 2018 10:49 IST|Sakshi
జనంతో నిండిపోయిన ఆలయం ,ఆలయ ప్రహరీపై హనుమాన్‌ చిత్రాన్ని తలపిస్తున్న ఆకారం (వృత్తంలో)

తిలకించేందుకు పోటెత్తిన జనం

తార్నాక: తార్నాక– సీతాఫల్‌మండి వెళ్లే రహదారిలోని ద ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) వద్ద ఉన్న మూడుగుళ్ల అమ్మవారి ఆలయ ప్రహరీపై  çఆంజనేయస్వామిని తలపించేలా ఆకారం ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది.   గోడపై ఆంజనేయ స్వామి చిత్రాన్ని చూసిన కొందరు ఈ విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పడంతో ఈ సమాచారం దావానంలా వ్యాప్తించింది.
మంగళవారం జరిగిన  ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తార్నాక నుంచి సీతాఫల్‌మండి బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిలో ద ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రహరీని ఆనుకుని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ మూడుగుళ్ల దేవాలయం ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇటీవలే ఆధునికీకరించారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆలయ ప్రహరీపై ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు ఆకుల మధ్య నుంచి ఆంజనేయస్వామి  ఆకారం కనిపించింది. విద్యుత్‌  కాంతుల మధ్య గోడపై ధగధగా మెరుస్తున్న ఆంజనేయస్వామి ఆకారాన్ని అటుగా వెళ్లున్నవారు గమనించారు. ఈ సమాచారం ఆ నోటా ఈనోటా బయటకు రావడంతో కొద్ది క్షణాల్లోనే ఆలయ ప్రాంగణం జనంతో నిండిపోయింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌తో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు