మరో ఘట్టం ఆవిష్కృతం 

1 Aug, 2019 01:59 IST|Sakshi
సుందిళ్ల పంపుహౌస్‌ నుంచి ఎల్లంపల్లికి దూసుకెళ్తున్న కాళేశ్వరం జలాలు

మంథని: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మహాఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణహిత జలాలను ఎల్లంపల్లి వద్ద గోదావరిలో కలపాలన్న సీఎం కేసీఆర్‌ కల సాకారమైంది. 20 రోజుల క్రితం మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌ ద్వారా రివర్స్‌ పంపింగ్‌తో మొదలైన కాళేశ్వరం జలాలు.. 120 కిలోమీటర్లు ఎదురెక్కి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ(సుందిళ్ల) పంప్‌హౌస్‌ డెలివరీ సిస్టం వరకు చేరాయి. దీంతో బుధవారం సాయంత్రం 7 గంటలకు మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతను ప్రారంభించారు.

ఈ నీరు కిలోమీటరు పైపులైన్‌ ద్వారా.. మరో కిలోమీటరు దూరం గ్రావిటీ కెనాల్‌ ద్వారా ప్రయాణించి గురువారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఘట్టం పూర్తవుతుంది. ఎల్లంపల్లి నుంచి ఈ నెల 5వ తేదీన నీటిని ఎత్తిపోసేందుకు ముహూర్తం ఖరారైంది. 3 బ్యారేజీలు, 3 పంపుహౌస్‌లు దాటిన కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లికి చేరుతుండటంతో ఇంజనీరింగ్‌ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు