ఏపీజే అబ్దుల్‌ కలాంకు ఘననివాళి

28 Jul, 2018 12:35 IST|Sakshi
కలాం చిత్రపటానికి పూలమాల వేస్తున్న  ఉపాధ్యాయులు

వనపర్తిటౌన్‌: అధికారం సమాజశ్రేయస్సుకు వెచ్చించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రాణం పోశారని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్‌ అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతిని శుక్రవారం టీజేఏసీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజారాంప్రకాశ్‌ మాట్లాడుతూ రెండోసారి రాష్ట్రపతి అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని తెలిపారు. రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత  మరుసటి రోజు అధికారిక లాంఛనాలను దరిచేరనీయలేదన్నారు. కలలు కని, వాటిని సహకారం చేసుకోవాలని భారతవనికి దిశనిర్దేశం చేసిన మహానీయుడు కలాం అని వెల్లడించారు. టీజేఎస్‌ పట్టణాధ్యక్షుడు ఖాదర్‌పాష, పానుగంటి నాగన్న, గిరిజన నేత హరీష్,  కృష్ణ పాల్గొ న్నారు.
 
ఖిల్లాఘనపురం: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాల్లో శుక్రవారం దివంగత మాజీ రాష్ట్రపతి భారత రత్న అవార్డు గ్రహిత ఏపీజే అబ్దుల్‌ కలాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వకృ త్వ పోటీల విజేతలకు  విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు  గోపి బహుమతులను అందజేశారు.  గురుపౌర్ణమిని పురష్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు.

మరిన్ని వార్తలు