కొందరికేనా!?

10 Nov, 2014 04:11 IST|Sakshi
కొందరికేనా!?

ప్రభుత్వ పథకాలు నకిలీలకు అందకుండా సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. ‘సమగ్ర సర్వే’ పేరిట జనాన్ని జల్లెడ పట్టింది. అసలు సిసలు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అధికార యంత్రాంగం ఇంటిం టికీ తిరిగి సర్వే జరిపింది. పూర్తిస్థాయి నిఘా నేత్రాన్ని సారించి నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సి పాలిటీలు, గ్రామీణ ప్రాం తాలలో 2,03,314 మందిని మొదటి విడతగా అర్హులుగా ప్రకటించింది. సామాజిక పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించింది. అయినా లబ్ధిదారులను సందేహాలు వీడడం లేదు.
-సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
 
‘ఆసరా’పై అనుమానాలు
* దరఖాస్తుదారులలో ఆందోళన
* తొలి జాబితాలో చాలా మందికి దక్కని చోటు
* మిగతా అర్జీలపై సాగుతున్న విచారణ
* గతంతో పోలిస్తే పెరిగిన విన్నపాలు
* పంపిణీని ప్రారంభించినా చేతికందని డబ్బులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సామాజిక భద్రత ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని సర్కారు శనివారం అట్టహాసంగా ప్రారంభించింది. అన్ని పథకాలలో నకిలీలను నివారించేందు కు ‘సమగ్ర సర్వే’ ఇంటింటి పరిశీలన తదితర కార్యక్రమాలను నిర్వహించిం ది. గత ప్రభుత్వం హయాంలో చెల్లించి న ఫించన్‌ను పెంచుతూ అర్హులకే అం దజేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత, సామాజిక ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై 300 బృందాలు విచారణ జరిపాయి.

ముందుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనే త, గీత కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 3,78,920 దరఖాస్తులు రాగా 2,03,314 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఇందు లో 300 మందికి శనివారం కలెక్టరేట్ మైదానంలో అర్హత పత్రాలను అందజేశారు. వీరందరికీ ఈ నెల 15 నుంచి ఫించన్లు అందుతాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్ర కటించారు. అయితే, మిగిలిన 1,75,606 మంది పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
గతంతో పోలిస్తే పెరిగిన దరఖాస్తులు
గత ప్రభుత్వం కూడ సామాజిక భద్రత పథకాలను అమలు చేసింది. జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 2,76,118 మందికి నెల నెలా రూ.7,02,70,100 పంపిణీ చేసింది. ఇందులో పలువురు ‘బోగస్’ లబ్ధిదారులున్నారన్న ఫిర్యాదు లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారు ఇష్టారాజ్యంగా వ్య వహరించి అనర్హులకు కూడా లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బోగస్ లబ్ధిదారులను ఏరి వేసేందుకు పూనుకుంది. అందుకే ఫి ంచన్లు పొందుతున్నవారందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

జిల్లావ్యాప్తంగా 3,78,920 దరఖాస్తు లు వచ్చాయి. అంటే, గతంతో పోలిస్తే 1,02,802 అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నమాట. అధికారులు సోమవారం ప్ర కటించిన జాబితాలో 2,03,314 మంది ఉన్నారు. దీని ప్రకారం, ఏరివేతకు ముందు వరకు పింఛన్ పొందుతున్నవారితో పోలిస్తే 72,804 మంది తగ్గా రు. ఈ నేపథ్యంలో మిగిలిన 1,75,616 దరఖాస్తుల పరిశీలన అనంతరం ఇం కెంత మందిని అర్హులుగా ప్రకటిస్తారు?  ఫింఛన్‌దారులు తగ్గుతారా? పెరుగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని, అర్హుల వారు ఎంతమం ది ఉన్నా.. అందరికీ ఫించన్లు అందజేస్తామని చెబుతున్నా సందేహాలు వీడ డం లేదు.
 
సాగుతున్న కసరత్తు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆహారభద్రత, సామాజిక భద్రత ఫిం చన్లు తదితర దరఖాస్తుల నుంచి ఇంకా అర్హుల ఎంపికపై కసరత్తు జరుగుతుం దని అధికారులు చెబుతున్నారు. సెప్టెం బర్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ముందుగా చెప్పినా, 20 వరకు కొనసాగించారు. దీంతో ఊహించిన దానికంటే అధికం గా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఆహారభద్రత కింద 7,25,723, సామాజిక భ ద్రత ఫించన్ కోసం 3,78,9200, కుల ధ్రువీకరణకు 1,12,011, ఆదాయం 1,00,531, స్థానికత ధ్రువీకరణ కోసం 93,961 దరఖాస్తులు వచ్చాయి.

వీటిపై విచారణ జరిపేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్ 300 బృందాలను రంగలోకి దిం పారు. చాలా వరకు అధికారులు బాగా పని చేసినా, నిజామాబాద్ కార్పొరేషన్ లాంటిచోట అడుగడుగునా జాప్యం, నిర్లక్ష్యం కనిపించింది. సమీక్ష నిర్వహిం చిన కలెక్టర్  కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమీషనర్ మంగతయారుపై అసంతృప్తి వ్య క్తం చేశారు. ఆర్మూరు, కామారెడ్డి, బో ధన్ మున్సిపాలిటీల అధికారులను కూ డ మందలించారు. ఎట్టకేలకు శుక్రవా రం నాటికి సర్వే ముగిసిందనిపించిన అధికారులు మొదటి విడత జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలోనే  ‘ఆసరా’ కొందరికా? అందరికా? అన్న చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు