వాజ్‌పేయి అజాతశత్రువు: దత్తాత్రేయ

26 Dec, 2016 00:50 IST|Sakshi
వాజ్‌పేయి అజాతశత్రువు: దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్‌:  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి అజాత శత్రువు, ఆదర్శవాది అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌ పేయి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ యువజన మోర్చా ఆధ్వ ర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా దత్తాత్రేయ మాట్లాడుతూ స్వతంత్రంగా, స్వశక్తితో ఎదిగిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు. వాజ్‌పేయి ప్రసంగాలు ఆసక్తికరంగా, సంపూర్ణ అవగాహనతో ఉండేవన్నారు. సంస్కరణలను అమలు చేయాలని చెప్పిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇప్పుడు పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించడం హాస్యాస్పదమని విమ ర్శించారు. రాబోయే రోజుల్లో 3 కోట్ల మందికి గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

గ్రామ పంచాయ తీలకు నిజమైన అధికారాలను ఇచ్చిన నాయకుడు ప్రధాని మోదీ అని దత్తాత్రేయ పేర్కొన్నారు. కె.లక్ష్మణ్‌ మాట్లాడు తూ. వాజ్‌పేయి జన్మదినాన్ని సుపరిపాలన దినంగా నిర్వ హిస్తున్నామన్నారు. వాజ్‌పేయి కలలను సాకారం చేసే విధంగా మోదీ పాలిస్తున్నారని చెప్పారు. ప్రతీ రూపాయి పేదవానికి, లబ్ధిదారునికి అందే విధంగా కేంద్రం అవినీతి రహిత సమాజంకోసం సంస్కరణలను తీసుకువచ్చిం దన్నారు. నగదురహిత లావాదేవీలను విస్తృతంగా ప్రచా రం చేయాలని లక్ష్మణ్‌ కార్యకర్తలకు సూచించారు.

మరిన్ని వార్తలు