పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు..

21 Aug, 2023 16:33 IST|Sakshi

పాట్న: బిహార్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్కు  పేరును కోకోనట్ పార్క్‌గా మార్చడంపై రాజకీయంగా వివాదానికి దారితీసింది. బిహార్‌ అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్ పేరును కోకోనట్ పార్క్‌గా సోమవారం అధికారికంగా పేరు మార్చారు. పార్క్ బయట శిలాఫలాకాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది.

పార్క్‌ను మొదట్లో కోకోనట్ పార్కు పేరుతోనే పిలిచేవారు. 2018లో అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం కోకోనట్ పార్క్‌కు అటల్ పేరును ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వం ఆ పార్కు పేరును కోకోనట్‌గా మార్చడంపై బీజేపీ నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 

'వాజ్‌పేయీ వర్థంతి సందర్భంగా నితీష్ కుమార్ ఇటీవల పూలమాలలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ అటల్ పేరుపై ఉన్న పార్కుకు కొత్త పేరును మార్చారు. ఒకే ప్రభుత్వం వాజ్‌పేయీపై విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్కుకు ‍అటల్ పేరును యథావిధిగా ఉంచాలి' అని బీజేపీ డిమాండ్ చేసింది. 

రాజకీయంగా వివాదాస్పదం కావడంతో అటల్ పార్కుకు రాకపోకలను నిలిపివేశారు. ఓ వైపు పార్కు బయట కోకోనట్ పేరుతో శిలాఫలకం ఉండగా.. పార్కు బయట వాజ్‌పేయీ పేరు అలాగే ఉంది. 

ఇదీ చదవండి: 'ఆపరేషన్ హస్త'.. నాయకుల మధ్య పొలిటికల్ వార్‌..

మరిన్ని వార్తలు