‘అవధాన రాజధాని’లో మనోడి వాణి

8 Nov, 2014 03:17 IST|Sakshi

వేములవాడ :
 ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘అవధాన రాజధాని’ కార్యక్రమంలో జిల్లావాసి తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. బ్రహ్మర్షి మాడ్గుల నాగఫణిశర్మ అవధాని నేతృత్వంలో అవధాన సరస్వతీ పీఠం - ఢిల్లీ తెలుగు అకాడమీ సం యుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర విద్యాసంస్థల సం స్కృత ఉపన్యాసకుడు మల్లారెడ్డికి పృశ్చకుడి(ప్రశ్న అడిగేవారి)గా అవకాశం వచ్చింది. సంస్కృత ఆశువు విభాగం లో ప్రశ్న సంధించారు.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వా మివారిని ముడిపెడుతూ రాజన్న ఆశీస్సులతో నూతన రాష్ట్రమైన తెలంగాణను నూతన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భవిష్యత్ పాలనను ప్రజల మనసు రంజింపజేసేలా వర్ణించమని మల్లారెడ్డి సంస్కృతంలో ప్రశ్న సంధిం చారు. ప్రతిగా అవధాని నాగఫణిశర్మ సమస్యా పూరణ చేశారు.

నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పరిపాలనా దక్షత చాటుకుంటాడని, శ్రీరాజ రాజేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు, అనుగ్రహంతో ధనప్రవాహం వెల్లువై రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చగలడన్న భావాన్ని ప్రకటిస్తూ ‘శ్రీచంద్రశేఖర విభుహు నితరాం సమర్థః శ్రీవేములేశ కురుణా పరిపాలితశ్చ శ్రీమత్ ధనాదిప మహా కరుణా ప్రవాహాత్ స్వర్ణీకరోతు తెలంగాణ నవాది రాష్ట్రామ్’ అంటూ పూరించారు. స్థానిక అంశాన్ని ముడిపెడుతూ ప్రశ్న సంధించిన మల్లారెడ్డిని భాషాభిమానులు, స్థానిక కవులు అభినందించారు.

మరిన్ని వార్తలు