400 మంది గర్భిణులతో మెగా సీమంతం!

15 Aug, 2019 11:09 IST|Sakshi

కేబీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమం

చీరలు కుంకుమబొట్లు పంపిణీ

సాక్షి, గజ్వేల్‌: ములుగు మండలంలోని క్షీరసాగర్‌ గ్రామంలో కేబీఆర్‌ ట్రస్టు చైర్మన్‌ కొన్యాల బాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కొన్యాల మమత ఆధ్వర్యంలో గర్భిణులకు బుధవారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 400లకు పైగా గర్భిణులు పాల్గొన్నారు.

గర్భిణులకు ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, ఎంపీటీసీ మమతలతో పాటు మహిళా ప్రజా ప్రతినిథులు సాంప్రదాయ పద్ధతిలో కుంకుమ బొట్టు, గాజులు, నూతన వస్త్రాలను అందజేశారు. వంటిమామిడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ జహంగీర్‌ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్షీరసాగర్‌ హోమియోపతి ఆస్పత్రి వైద్యుడు హుమేశ్, సింగన్నగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

సామాజిక కార్యక్రమాలను నిర్వహించే కేబీఆర్‌ ట్రస్టు చైర్మన్‌ బాల్‌రెడ్డిని ఆయా గ్రామాల ప్రజాప్రతినిథులు, నాయకులు, గ్రామస్తులు అభినందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ యాదమ్మ, ఎంపీటీసీలు హరిబాబు, అశ్విత, టీఆర్‌ఎస్‌ యూత్‌విభాగం రాష్ర కార్యదర్శి బట్టు అంజిరెడ్డి, నాయకులు అర్జున్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు