తెలంగాణలో వెదురు పారిశ్రామిక వాడ

19 Apr, 2018 02:58 IST|Sakshi

త్రిపుర నుంచి నిష్ణాతులను రప్పించి శిక్షణ ఇప్పిస్తాం: జోగు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వెదురు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు చర్యలు చేపడతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. వెదురు పరిశ్రమల అభివృద్ధి, మేదరుల ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ బృందం బుధవారం త్రిపుర రాష్ట్రం బోధజంగ్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడి వెదురు పరిశ్రమలను వారు సందర్శించి ఆర్థిక వ్యవహారాలపై చర్చించారు. తెలంగాణకు చెందిన త్రిపుర రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నాగరాజు ఈ మిషన్‌ కార్యక్రమాలను రాష్ట్ర బృందానికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ తెలంగాణలోనూ వెదురు పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెదురు ఉత్పత్తులపై రాష్ట్ర మేదరులకు శిక్షణనిచ్చేందుకు త్రిపుర నుంచి నిష్ణాతులను పంపించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించింది. ఈ పర్యటనలో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, సీఈవో అలోక్‌ కుమార్, మేదర సంఘం ప్రతినిధులు వెంకటరాముడు, బాలరాజు, శ్రీనివాస్, దేవేందర్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు