బెల్టు షాపులు మూసేయాలి: భట్టి

19 Dec, 2019 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలపై మద్యం రూపంలో రుద్దుతోందని కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మద్యంపై వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని పాలించాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నా రన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులను మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో తీర్చేం దుకు కేసీఆర్‌ ప్రణాళిక రూపొందించినట్టు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వెంటనే బెల్టు షాపులు, పరి్మట్‌ రూంలు, హైవేలపై మద్యం విక్రయాలు నిలిపివేయాలని భట్టి డిమాం డ్‌ చేశారు. మద్యంపై ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు