కమల దళం ప్రచార జోరు!

20 Nov, 2023 04:30 IST|Sakshi

మరో తొమ్మిది రోజులే మిగిలి ఉండటంతో దూకుడు 

అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, సీనియర్ల వరుస పర్యటనలు 

సంఘ్‌ పరివార్‌ పక్షాన ‘జన జాగరణ’పేరిట కార్యక్రమాలు 

మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసేందుకు తొమ్మిది రోజులే మిగిలి ఉండటంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్లతో రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట మరింత ఫోకస్‌ చేస్తోంది. ఆయా చోట్ల ప్రచారాన్ని ఉధృతం చేయడం, పార్టీ పోలింగ్‌ బూత్‌ కమిటీలతో క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపట్టడంపై దృష్టి పెట్టింది.

ఇక పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ సీఎం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, ఉజ్వల లబ్దిదారులకు ఏటా ఉచితంగా నాలుగు గ్యాస్‌ సిలిండర్లు, ఆడపిల్ల పుడితే సొమ్ము ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి 21 ఏళ్లు వచ్చే నాటికి రూ.2 లక్షల అందజేత, డిగ్రీ, వృత్తివిద్యా కోర్సులు చదివే విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేత, స్వయం సహాయ బృందాలకు ఒకశాతం వడ్డీకే రుణాలు వంటి హామీలను వివరించి ప్రజల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. 

అగ్రనేతల పర్యటనలతో.. 
శని, ఆదివారాల్లో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృతంగా సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. అమిత్‌షా సోమవారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజే పీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్యనేతలు కూడా వరుస పర్యటనలకు రా నున్నారు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఎల్లారెడ్డి, కొల్లాపూర్‌ సభల్లో, మరోచోట రోడ్‌షోలో పాల్గొంటారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీ స్‌ సోమవారం ముషీరాబాద్‌ రోడ్‌ షోలో పాల్గొంటారు. మంగళవారం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రచారం చేస్తారు. ఇక ఈ నెల 24, 25, 26 తేదీల్లో ప్రచా రం కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రానున్నారు. ఇదే సమయంలో అ స్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. 25న హుజూరాబాద్‌ , 26న మహేశ్వరంలో జరిగే స భల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీ తారామన్‌ జూబ్లీహిల్స్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నా రు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మహేశ్వరంలో ప్రచారం చేస్తారు. చివ రిగా 26, 27 తేదీల్లో మోదీ బహిరంగ సభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు. 

సంఘ్‌పరివార్‌ ప్రచారం!: మరోవైపు సంఘ్‌పరివార్‌ పక్షాన ‘జన జాగరణ’పేరిట వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంటోంది. సంఘ్‌ శాఖల ఆధ్వర్యంలో పోలింగ్‌ బూత్‌ల వారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి ఓటర్లు, యువత, నిరుద్యోగులను కలసి మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు.

మరిన్ని వార్తలు