కేసీఆర్‌,కేటీఆర్‌కు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంక గాంధీ

19 Nov, 2023 13:42 IST|Sakshi

సాక్షి, ఖానాపూర్‌: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని,  మీరు మాత్రం కేసీఆర్,కేటీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వకండని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. ఖానాపూర్‌లో జరిగిన విజయభేరి సభలో ప్రియాంక ప్రసంగించారు.కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను లూఠీ చేశాడని ఫైర్‌ అయ్యారు. 

 ‘అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. ధరణి పోర్టల్ లో అన్ని తప్పులున్నాయి. ఇలాంటి ధరణిని బంద్‌ చేసి మంచి కార్యక్రమం తీసుకువస్తాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. బీజేపీ పెద్ద కంపెనీలతో దోస్తానీ చేసి దేశాన్ని నాశనం చేస్తోంది. పది సంవత్సరాల నుంచి తెలంగాణను కేసీఆర్ నాశనం చేస్తున్నాడు. మోదీ తెలంగాణకు వచ్చి కాళేశ్వరం గురించి మాట్లాడడు. ఇద్దరు ఒక్కటే.  బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంఐఎం మూడు పక్కపక్కనే ఉండి  డ్రామాలాడుతున్నాయి. పవర్‌లోకి రాగానే రూ.500కు గ్యాస్‌ సిలిండర్ ఇస్తాం. కర్ణాటక తరహాలో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం కల్పిస్తాం. 


కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదు. ఇతర స్టేట్స్‌కు వెళ్లి పోటీచేసే ఎంఐఎం తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోంది. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్‌ ఉంది. మోదీ సర్కార్‌ కార్పొరేట్లకు రుణమాఫీ చేస్తుంది తప్ప రైతుల గురించి పట్టించుకోదు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ జాబ్‌ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేస్తుంది. ఇప్పటికే జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాం. 

కాంగ్రెస్‌ విపక్ష నేతలే టార్గెట్‌గా ఈడీ, సీబీఐలతో మోదీ దాడులు చేయిస్తారు. ఇందిరాగాంధీ గిరిజనులు,ఆదివాసీల కోసం ఎంతో చేశారు. ఆమె చనిపోయి నలభై ఏ‍ళ్లయినా ప్రజలు ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు. గిరిజనులు, ఆదివాసీల కోసం ఇందిర ఎంతో చేశారు. ఇవాళ క్రికెట్ ప్రపంచ కప్ ఉంది భారత్ ప్రపంచ కప్ గెలవాలని అందరం కోరుకుందాం’అని ప్రియాంక అన్నారు. 

ఇదీచదవండి..బాబూ మోహన్‌కు తనయుడి షాక్‌

మరిన్ని వార్తలు