ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి రాత్రివేళ ఫ్రీకాల్స్

29 Apr, 2015 00:56 IST|Sakshi

బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎం శ్రీనివాసమూర్తి
 నల్లగొండ అర్బన్: ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్‌నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ల్యాండ్‌లైన్ ఫోన్‌ల నుంచి రాత్రంతా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే ఆఫర్‌ను అందిస్తున్నారని టెలికాం జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఆఫర్‌ను మే 1వ తేదీనుంచి అమల్లోకి తెస్తున్నట్లు వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ ఫోన్ నుంచి రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశంలో ఏ ప్రాంతానికైనా ఏ నెట్‌వర్క్ ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్‌లకు ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చని తెలిపారు. అన్ని ల్యాండ్‌లైన్ పట్టణ, గ్రామీణ, సాధారణ ప్లాన్‌లు, స్పెషల్ ప్లాన్, కాంబోప్లాన్‌లకు  బ్రాడ్‌బాండ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.
 
 అంతకంతకు తగ్గిపోతున్న ల్యాండ్‌లైన్‌ల కనెక్షన్‌లకు మళ్లీ గిరాకీ కనిపించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ల్యాండ్‌లైన్‌ల కోసం దగ్గరలో వున్న బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీసుల కోసం సంప్రదించాలని సూచించారు.18003451500 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని అన్నారు. ఈ పథకం ఎంత కాలం కొనసాగించాలనే విషయాన్ని నిర్ధారించలేదని తెలిపారు. ఆరునెలల తరువాత ప్రగతిని సమీక్షించి సేవలను కొనసాగించే యోచన చేస్తారని అన్నారు.
 
 ఇదే కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లను కూడా అమలు చేస్తున్నదని వివరించారు. డాటా ప్లాన్ ఓచర్ స్కీం ద్వారా రూ. 3299 తీసుకునే వారికి డాటా కార్డు ఉచితంగా అందిస్తారని అన్నారు. బీపీవీ-229 తీసుకుంటే రూ.300 కే డాటా కార్డును ఇస్తారని, డీపీవీ-1251 తీసుకుంటే రూ. 600 డాటా కార్డును అందజేస్తారని తెలిపారు. రూ. 2వేల నుంచివెయ్యి వరకు, రూ. 1500 నుంచి రూ. 10వేల వరకు ఫుల్‌టాక్‌టైమ్ అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు వేణుగోపాల్, వజీరుద్దీన్, జగన్మోహన్‌రెడ్డి, జేటీఓ శ్రీనివాస్ పాల్గొన్నార
 

మరిన్ని వార్తలు