లెక్క..కుదరడం లేదు..!

18 Jun, 2014 03:04 IST|Sakshi
లెక్క..కుదరడం లేదు..!

 ఎన్నికలు పూర్తయినా అభ్యర్థులు వాటికి చేసిన ఖర్చుల వివరాలు కొలిక్కి రావడం లేదు. కొంతమంది సమర్పించినా అవి మమ అనిపించేలా ఉన్నాయి. అధికులు అధికారుల నోటీసులకు స్పందించడమే లేదు. దీంతో వ్యయ పరిశీలకులు జిల్లాలోనే మరో అయిదురోజుల పాటు మకాం వేసి నిగ్గు తేల్చాలని కంకణం కట్టుకున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధార ణ ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లాలో మూడు రోజులుగా మకాం వేసినా అభ్యర్థుల ఖర్చుకు సంబంధించిన లెక్కలు తే లడం లేదు. రెండు లోక్‌సభ, 14 అసెం బ్లీ స్థానాల్లో 164 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఇప్పటి వరకు 127 మం ది ఎన్నికల వ్యయానికి సంబంధించి లె క్కలు సమర్పించగా, మరో 37 మంది అ భ్యర్థులుస్పందించడం లేదు.
 
 మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు, కొడంగల్, దేవరకద్ర, అచ్చంపేట, కల్వకుర్తి అ సెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు వ్యయ వివరాలు సమర్పించారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఎనిమిది మంది, షాద్‌నగర్‌లో ఆ రుగురు అభ్యర్థులు లెక్కలు సమర్పిం చాల్సి వుంది. నోటీసులు ఇచ్చినా స్పం దించని అభ్యర్థుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎన్నికల సంఘం దృ ష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 22వ తేదీ వరకు జిల్లాలోనే మకాం వేసి అభ్యర్థులు సమర్పించిన వ్యయ వివరాలను పద్దుల వారీ గా తనిఖీ చేస్తామని పరిశీలకులు ప్రకటించారు.
 
  చాలా మంది అభ్యర్థులు స మర్పించిన వివరాలు అసమగ్రంగా ఉం డటంతో రెండు రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ వివరాలు సరిచూసేందుకు ఈ నెల 14న జిల్లాకు వచ్చిన నలుగురు ఐఆర్‌ఎస్ అధికారుల బృందం వచ్చిన విషయం తెలి సిందే. తొలుత ఈ నెల 16 వరకే ప్రక్రియ పూర్తి చేయాలని వ్యయ పరిశీలకుల బృం దం భావించినప్పటికీ అభ్యర్థుల నుంచి స్పందన లేకపోవడంతో 22 వరకు జిల్లాలోనే మకాం వేయనున్నారు.
 
 పొంతన లేని తీరుపై ఆరా
 మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో పో టీ చేసిన బీజేపీ అ భ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి రూ.21.11 లక్షలు వ్యయం చేసినట్లు లెక్కలు సమర్పించారు. అయితే మీడియాలో ప్రకటన రూపం లో రూ.25.95లక్షలు ఖర్చు చేసినట్లు వ్యయ పరిశీలకులు గు ర్తించారు. ఇందులో రూ.18.72 లక్షలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి ఖర్చు చేసినందున వివరాలు సమర్పిం చాలని నో టీసులు జారీ చేశారు.
 
 మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రూ. 33.50 లక్షలు, ఎంపీ జితేందర్‌రెడ్డి రూ.43.16లక్షలు ఖర్చు చే సినట్లు లెక్కలు సమర్పిం చారు. అయితే జైపాల్‌రెడ్డి రూ.18లక్షలు, జితేందర్‌రెడ్డి రూ.22.18 లక్షలు మీ డియా ప్రచారానికి ఖర్చు చేసినట్లు వ్య య పరిశీలకులు గుర్తించారు. పూర్తి వివరాలు అందజేయాలంటూ అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి రెండు రోజుల గడువు విధించారు.
 

మరిన్ని వార్తలు