ప్రారంభమైన కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికలు

11 Jan, 2015 11:11 IST|Sakshi

హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ బోర్డుకు 16 మంది సభ్యులు ఉండగా, వీరిలో 8 మంది సైనికాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి, పలువురు అధికారులు ఉన్నారు. మిగతా 8 మంది కోసం నేడు పోలింగ్ జరుపనున్నారు. బోర్డు అధికారిగా సైనికాధికారితోపాటు ఉపాధ్యక్షుడిగా ప్రజలతో ఎన్నికైన బోర్డు సభ్యుడు ఒకరు నియమించబడ్డారు.

8 వార్డులలో లక్షా 67వేల మంది ఓటర్లు ఉండగా,  ఈ 8 వార్డులకు సంబంధించి113 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే మొదటిసారిగా ఈవీఎంలను ఎన్నికల అధికారులు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 40 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసు శాఖ గుర్తించింది. అందులో భాగంగానే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కంటోన్మెంట్ పరిధిలో144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు