బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌కు తాళాలు వేసిన అధికారులు

21 Oct, 2019 09:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌ సోమవారం చలో ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన కారులు స్టేషన్‌లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్‌లో నోటీసు అంటించారు. 

కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస​ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో పాటు పలువరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మరిన్ని వార్తలు