సరిహద్దులు మారిస్తే అప్రజాస్వామికమే: కేసీఆర్

27 May, 2014 15:41 IST|Sakshi
సరిహద్దులు మారిస్తే అప్రజాస్వామికమే: కేసీఆర్

ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేందుకు ఆర్డినెన్సును తయారు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల సరిహద్దులను మార్చాలనుకుంటే.. రాజ్యాంగంలోని మూడో అధికరణం ప్రకారం రెండు రాష్ట్రాలను సంప్రదించాల్సిందేనని ఆయన చెప్పారు.

ఇప్పటికిప్పుడు ఈ విషయం కోసం తొందర పడాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ఒకవేళ రెండు రాష్ట్రాలను సంప్రదించకుండా సరిహద్దులను మారిస్తే మాత్రం అది అప్రజాస్వామికమే అవుతుందని కేసీఆర్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అయితే డ్యాం ఎత్తు తగ్గించి, గిరిజనుల ఆవాసాలు ముంపు బారిన పడకుండా చూసుకుని కొత్త డిజైన్ ప్రకారం ప్రాజెక్టు కడితే ఎవరికీ ఇబ్బంది ఉండబోదని, అలాంటప్పుడు తాము కూడా ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. భద్రాచలం తెలంగాణలో ఉండి, దాని పరిధిలో ఉండే ఏడు మండలాలను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం సమంజసం కాదని అన్నారు.

>
మరిన్ని వార్తలు